తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత జయశంకర్‌

ABN , First Publish Date - 2022-08-07T05:03:35+05:30 IST

తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూ ర్తిని రగిల్చిన మహనీయుడు, స్ఫూర్తిదాయకమైన వ్య క్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత జయశంకర్‌
జయశంకర్‌ చిత్రపటానికి నివాళి అర్పించిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

 - జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- ఘనంగా సార్‌ జయంతి

గద్వాల/క్రైం/టౌన్‌, ఆగస్టు 6: తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూ ర్తిని రగిల్చిన మహనీయుడు,  స్ఫూర్తిదాయకమైన వ్య క్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో జయ శంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిం చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సిద్ధాం తాలను వివరించారు. అదేవిధంగా మండల పరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, ఎంపీడీవో రవీంద్ర పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయానాయక్‌, నాయకులు తిరుపతయ్య, శ్రీనాథ్‌రెడ్డి, కురవ పల్లయ్య, నర్సింహులు, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌లో..

కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో  ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ శ్రీహర్ష పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జయశంకర్‌ కలలుగన్న తెలంగాణ సిద్ధించిందని, ఆయన ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో విజయానాయక్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి శ్వేత ప్రియదర్శిని, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ వరలక్ష్మి, రాజు, మధన్‌మోహన్‌, సిబ్బంది ఉన్నారు. అలాగే  జిల్లా పోలీస్‌ కార్యాలయం లో జయశంకర్‌ చిత్రపటానికి  ఎస్పీ రంజన్‌ రతన్‌ కు మార్‌ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.  కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్‌, ఏవో సతీష్‌కుమార్‌, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, సీసీ లోహిత్‌కుమార్‌ తదితరులున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

 జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రొఫె సర్‌ జయశంకర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.కా ర్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బి.ఎస్‌.కేశవ్‌,  పీఏ సీఎస్‌ డైరెక్టర్‌ సుభాన్‌, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌,  ఎంపీపీ ప్రతాప్‌గౌడు, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-08-07T05:03:35+05:30 IST