తెలంగాణ రచయితల వేదిక ప్రతి సంవత్సరం ఇచ్చే ‘ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మారక పురస్కారం’ 2022 సంవత్సరానికి గాను, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికోద్యమకారుడు, దివ్యాంగుల హక్కులు–సంక్షేమం కోసం కృషిచేస్తున్న గాదె ఇన్నయ్యకు ప్రదానం చేయనున్నారు. నేడు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల దొడ్డి కొమురయ్య హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కొండి మల్లారెడ్డి, గాజోజు నాగభూషణం, జూకంటి జగన్నాథం, పాశం యాదగిరి. దేవరకొండ కాళిదాస్, సి.వి. కుమార్ తదితరులు పాల్గొంటారు.
– తెలంగాణ రచయితల వేదిక