ప్రవాసాంధ్రుల హర్షం
ఎన్నారై డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు NRI TDP USA కో-ఆర్డినేటర్‌గా జయరాం కోమటిని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ క్రమంలో జయరాం కోమటి స్పందించారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతని అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు జయరాం కోమటి ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో పార్టీని మరింత పటిష్ట పరచుతూ 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తానని జయరాం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు జయరాంని అభినందించారు.
ఇవి కూడా చదవండి