రైతులను ఇబ్బంది పెడితే సహించం

ABN , First Publish Date - 2022-06-30T05:47:34+05:30 IST

రైతులను ఇబ్బంది పెడితే సహించం

రైతులను ఇబ్బంది పెడితే సహించం
శ్రీరంగపురంలో పూడుకుపోయిన పంట బోదెను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ, రైతులు

ఇసుక రవాణాదారులకు జయమంగళ హెచ్చరిక
 కైకలూరు, జూన్‌ 29: ఇసుక అనధికార రవాణాతో పంట బోదెలు, కాల్వలను పూడ్చి వేయడమేకాక రైతులను ఇబ్బంది పెడుతున్నారని, సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం వేమ వరప్పాడు గ్రామశివారు శ్రీరంగపురంలో పర్యటించిన ఆయన రైతుల సమస్యలను తెలుసు ున్నా రు. నిత్యం అధిక బరువుతో ఇసుక టిప్పర్లు తిరగడం వలన రహదారులు ధ్వంసం అవుతున్నా యని, ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని, పంట బోదెలు, కాల్వలు పూడుకుపోయాయని రైతులు, ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామం లోని ఊరచెరువుకు నీరు పెట్దేందుకు ఏర్పాటు చేసిన తూములు ధ్వంసమయ్యాయని వాటికి మరమ్మతులు చేసుకునేందుకు పుంత రహదారులు తవ్వకాలు చేసినట్లు రైతులు తెలిపారు. పూడుకు పోయిన బోదెలు తవ్వకాలు చేయాలని ఇసుక రవాణా చేసే నిర్వాహకులను కోరగా పట్టించుకోక పోగా అక్రమకేసులు బనాయిస్తున్నారని రైతులు చెప్పారు. కాల్వలకు నీరు వచ్చినా విడుదల చేయకుండా అనధికార ఇసుక రవాణాకు అధి కారులు వత్తాసు పలకడం దారుణమన్నారు. ప్రభు త్వాలు పార్టీల పక్షపాతిగా మారి రైతులను ఇబ్బంది పెడితే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏలూరు జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు లక్ష్మీరాణి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు బోడావుల వసంతరావు, నున్న కొండ, మాజీ ఎంపీ టీసీ బోడావుల శ్రీని వాసరావు, ఏఎంసీ మాజీ డైరె క్టర్‌ నున్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:47:34+05:30 IST