Jayamangali river water: ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్న జయమంగళి

ABN , First Publish Date - 2022-08-04T17:34:02+05:30 IST

తుమకూరు జిల్లాలో రెండువారాలకు పైగా నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీగా వర్షం కురవడంతో జయమంగళి

Jayamangali river water: ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్న జయమంగళి

                            - హిందూపురం ప్రాంతానికి భారీగా వరద


బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తుమకూరు జిల్లాలో రెండువారాలకు పైగా నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీగా వర్షం కురవడంతో జయమంగళి నది(Jayamangali river) ప్రమాదస్థాయినని మించి ప్రవహిస్తోంది. 30 ఏళ్ల తర్వాత జయమంగళి నది ప్రమాదకర స్థాయికి చేరిందని పరివాహక ప్రజలు చెబుతున్నారు. జయమంగళి నది పోటెత్తుతుండడంతో హిందూపురం ప్రాంతానికి భారీగా వరద చేరే అవకాశం ఉంది. తుమకూరు సమీపంలోని దేవరాయదుర్గలో జన్మించే జయమంగళి నది కొరటగెరె, కొడగదాల, పురవర, కొడిగెనహళ్లి మీదుగా సత్యసాయి జిల్లా పరిగి మండలంలోకి ప్రవేశిస్తుంది. జయమంగళి నది((Jayamangali river)కి అనుబంధంగా గొరవనహళ్లిలో ఉండే తీత ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జయమంగళి నది ఓ మోస్తరుగా పారి రెండున్నర దశాబ్దాల దాటిందని స్థానికుల అంటున్నారు. తుమకూరు(Tumakuru), కొరటగెరె, మధుగిరి ప్రాంతాల్లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున నది ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. మధుగిరి తాలూకా పురవర హోబళి చెన్నసాగర, హనుమంతపుర, హంద్రాళు, తగ్గిహళ్లి, గిడ్డయన్నపాళ్య, సంకాపుర, వీరనాగేహళ్లితో పాటు సుమారు 30 గ్రామాల పరిధిలోని ఇళ్లలోకి నీరు చేరగా పంటలు నాశనమయ్యాయి. కాళేనహళ్లి గ్రామానికి చెందిన శ్రీరామప్పకు చెందిన 12 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. జయమంగళి నదీపరీవాహక గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. సమీపంలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది.

Updated Date - 2022-08-04T17:34:02+05:30 IST