Jayalalita మృతిపై ఓపీఎస్‌కు సమన్లు

ABN , First Publish Date - 2022-03-09T15:55:06+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై చేపట్టిన విచారణకు ఈ నెల 21న హాజరుకావాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సమన్లు జారీచేసింది. జయలలిత

Jayalalita మృతిపై ఓపీఎస్‌కు సమన్లు

అడయార్‌(చెన్నై): మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై చేపట్టిన విచారణకు ఈ నెల 21న హాజరుకావాలని అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సమన్లు జారీచేసింది. జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం గతంలో ధర్మయుద్ధం చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న అన్నాడీ ఎంకే ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ వ్యవహారంపై కమిషన్‌ ఇప్పటివరకు 154 మందిని విచారించింది. అనంతరం కమిషన్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ కారణంగా విచారణ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో, కోర్టు ఉత్తర్వులతో మళ్లీ కమిషన్‌ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 21వ తేది నేరుగా హాజరుకావాలని పన్నీర్‌సెల్వం, శశికళ సోదరుడి భార్య ఇళవరసిలకు ఆర్ముగస్వామి కమిషన్‌ సమన్లు జారీచేసింది. కాగా, పన్నీర్‌సెల్వంకు గతంలో 9 సార్లు కమిషన్‌ సమన్లు జారీచేయగా, పలు కారణాలతో ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 21వ తేది ఓపీఎస్‌ హాజరై వాంగ్మూలం ఇచ్చే అవకాశ ముందని సమాచారం.

Updated Date - 2022-03-09T15:55:06+05:30 IST