Jayalalita మృతిపై ఎడప్పాడిని విచారించాలి

ABN , First Publish Date - 2022-04-27T14:08:04+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామిని విచారించాలని అన్నాడీఎంకే బహిష్కృత నేత పుగళేంది డిమాండ్‌

Jayalalita మృతిపై ఎడప్పాడిని విచారించాలి

                               - పుగళేంది డిమాండ్‌


అడయార్‌(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామిని విచారించాలని అన్నాడీఎంకే బహిష్కృత నేత పుగళేంది డిమాండ్‌ చేశారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ ఇప్పటికే 150 మందిని విచారించింది. ఇందులో భాగంగా మంగళవారం పుగళేంది విచారణకు హాజరయ్యారు. అనంతరం పుగళేంది మీడియాతో మాట్లాడుతూ... అనారోగ్యంపాలైన జయకు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్ళాలని భావించి, తరువాత ఎందుకు విరమించుకున్నారని ప్రశ్నించారు. ఏది ఏమైనా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడిని ఈ విషయంపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, జయలలిత మృతిపై కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్ముగస్వామి తన నివేదికను జూలై నెల 26న ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-27T14:08:04+05:30 IST