Abn logo
Oct 15 2021 @ 00:30AM

జయ జయ జయహే..!

కడప అమ్మవారి శాలలో వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అలంకారం

నేడు విజయదశమి


కడప(మారుతీనగర్‌), అక్టోబరు 14: జగన్మాత దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శుక్రవారం  విజయదశమి పర్వదినం జరుపుకోనున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు, వివిధ పనులకు వెళ్లిన జనం కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు గ్రామాలకు చేరుకున్నారు. విజయదశమి రోజు చేపట్టే ఏ కార్యాలైనా శుభాన్ని చేకూరుస్తాయనే నమ్మకం ఉండడంతో పలు పనులను, వివిధ శుభకార్యాలను నేడు ప్రారంభించనున్నారు. దసరా రోజున పాలపిట్టను చూడటం శుభకరంగా పెద్దలు పేర్కొంటారు. కాగా శరన్నవరాత్రుల్లో భాగంగా పలు ఆలయాల్లో అమ్మవారు మోహినీరూపంలో, బాలా త్రిపురసుందరిగా, కన్యకాపరమేశ్వరిగా, గాయత్రిదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు.

 

ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో గాయత్రీదేవి అలంకారం