Sep 25 2021 @ 19:59PM

సినిమా ఇండస్ట్రీలో 50ఏళ్లు పూర్తి చేసుకున్న అలనాటి నటి..ఫొటోలు పోస్ట్ చేసిన ఈ తరం నటుడు

ముంబై: కుటుంబం మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు అభిషేక్ బచ్చన్. తాజాగా బిగ్‌బుల్ చిత్రంలో నటించి అభిమానులను అలరించారు. తన తల్లి జయబచ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిషేక్ తన తల్లి నటించిన ఐకానిక్ మూవీస్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకున్నారు.


అభిషేక్ బచ్చన్ తన తల్లి నటించిన అభిమాన్, చుప్కేచుప్కే, గుడ్డి, కభీ ఖుషీ కభీ గమ్ చిత్రాల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ నీకు కుమారుడిగా జన్మించినందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేటితో 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. హ్యాపీ 50 ఇయర్స్ ఆఫ్ సినిమా అమ్మ. ఐలవ్ యూ’’ అని ఆ పోస్టు కింద రాశారు. ఈ పోస్టును జయబచ్చన్ కుమార్తె శ్వేత బచ్చన్, ఆమె మనవరాలు నవ్యనవేలి నంద, అనిల్‌కపూర్, బాబీ‌దియోల్, దియామీర్జా తదితరులు లైక్ చేశారు. 


 

Bollywoodమరిన్ని...