JNTUHలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-10-04T23:44:55+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌) - ఫుల్‌ టైం పీహెచ్‌డీ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

JNTUHలో పీహెచ్‌డీ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌) - ఫుల్‌ టైం పీహెచ్‌డీ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. యూజీసీ, సీఎస్‌ఐఆర్‌, డీఎ్‌సటీ ఇన్‌స్పయిర్‌, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అర్హత పొందినవారు; నెట్‌/జీప్యాట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, రిసెర్చ్‌ పబ్లికేషన్స్‌ వెయిటేజీ, ప్రపోజ్డ్‌ రిసెర్చ్‌ వర్క్‌ ప్రజంటేషన్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. 


విభాగాలు - స్పెషలైజేషన్‌లు

ఇంజనీరింగ్‌: సివిల్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: బయోటెక్నాలజీ, కెమికల్‌ సైన్సెస్‌ - కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, వాటర్‌ రిసోర్సెస్‌

మేనేజ్‌మెంట్‌ సైన్స్‌: మేనేజ్‌మెంట్‌

అర్హత: ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లకు సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్‌/ఏఎంఐఈతో పాటు ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసి ఉండాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లకు సంబంధిత సబ్జెక్ట్‌లతో ఎమ్మెస్సీ/ ఎమ్మెస్సీ - టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసీ స్పెషలైజేషన్‌కు బీఫార్మసీతోపాటు ఎంఫార్మసీ/ ఫార్మాడీ పూర్తి చేసి ఉండాలి. మేనేజ్‌మెంట్‌ విభాగానికి ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులందరికీ పీజీ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. 


ముఖ్య సమాచారం

అడ్మిషన్‌ ఫీజు: రూ.1500  ఒ  ట్యూషన్‌ ఫీజు: ఏడాదికి రూ.20,000

దరఖాస్తు ఫీజు: రూ.1500 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 21

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

Updated Date - 2022-10-04T23:44:55+05:30 IST