JNTUHలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు

ABN , First Publish Date - 2022-07-04T21:36:25+05:30 IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Technological University) (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహిస్తున్న స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌

JNTUHలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(Jawaharlal Nehru Technological University) (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వహిస్తున్న స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(School of Continuing and Distance Education) (ఎస్‌సీడీఈ) - ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్లాక్‌ చెయిన్‌, డేటా సైన్స్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, క్లౌడ్‌ అండ్‌ డెవోప్స్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు సబ్జెక్ట్‌లు, ఒక ప్రాజెక్ట్‌ ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు రెండు గంటలపాటు ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. థియరీ క్లాస్‌లతోపాటు ల్యాబ్‌ సెషన్స్‌ కూడా ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. 

  • బ్లాక్‌ చెయిన్‌ కోర్సులోని సబ్జెక్ట్‌లు: బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, బిట్‌కాయిన్‌ అండ్‌ క్రిప్టోకరెన్సీ, ఎథీరియం అండ్‌ హైపర్‌ లెడ్జర్‌
  • డేటా సైన్స్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ సబ్జెక్ట్‌లు: ప్రోగ్రామింగ్‌ - పైథాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా
  • క్లౌడ్‌ అండ్‌ డెవోప్స్‌ సబ్జెక్ట్‌లు: క్లౌడ్‌ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్‌ అండ్‌ మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌, కంటిన్యూయస్‌ ఇంటిగ్రేషన్‌/ కంటిన్యూయస్‌ డెప్లాయ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవిజనింగ్‌  
  • అర్హత: ఏదేని డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం, ఏదేని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం తప్పనిసరి.  


ముఖ్య సమాచారం

అడ్మిషన్‌ ఫీజు: రూ.1000

కోర్సు ఫీజు: రూ.25,000

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 23

కోర్సు ఫీజు చెల్లింపులు: ఆగస్టు 6 నుంచి 13 వరకు

తరగతులు ప్రారంభం: ఆగస్టు 15 నుంచి  

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

Updated Date - 2022-07-04T21:36:25+05:30 IST