JNCASRలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-06-30T21:06:59+05:30 IST

బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటీరియల్స్‌ సైన్స్‌ (పీజీడీఎంఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

JNCASRలో ప్రవేశానికి దరఖాస్తులు

బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటీరియల్స్‌ సైన్స్‌ (పీజీడీఎంఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడ మిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి అడ్మిషన్స్‌ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

ఈ మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూలై 6న

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: జూలై 12న

ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందిన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూలై 15న

తరగతులు ప్రారంభం: ఆగస్టులో

ఈ మెయిల్‌: admissions@jncasr.ac.in

వెబ్‌సైట్‌: www.jncasr.ac.in/admission

Updated Date - 2022-06-30T21:06:59+05:30 IST