‘ఎన్‌440కె’ ప్రమాదకరం కాదు: జవహర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-07T09:49:41+05:30 IST

కరోనా వ్యాప్తిలో ‘ఎన్‌440కె’ వైరస్‌ ఉనికిని గతేడాది జూన్‌-జూలైలోనే గుర్తించారని, అది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కొవిడ్‌ నిరోధక కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు

‘ఎన్‌440కె’ ప్రమాదకరం కాదు: జవహర్‌రెడ్డి

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిలో ‘ఎన్‌440కె’ వైరస్‌ ఉనికిని గతేడాది జూన్‌-జూలైలోనే గుర్తించారని, అది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కొవిడ్‌ నిరోధక కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ‘ఎన్‌440కె’ వైరస్‌ అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తిచెందుతోందని రెండు రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన జవరహర్‌రెడ్డి గతేడాది సీసీఎంబీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కోవిడ్‌ శాంపిళ్లను పరీక్షించినపుడే ‘ఎన్‌440కె’ వైరస్‌ (బి.1.36 రకం) వెలుగుచూసినట్లు వివరించారు. 

Updated Date - 2021-05-07T09:49:41+05:30 IST