Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆటలో అరటిపండు ‘ఆళ్ల’...: జవహర్‌

అమరావతి: చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీ అయిందని తెలుగుదేశం సీనియర్ నేత జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత హక్కులు దళారుల చేతిలో ఉన్నాయని చెప్పారు. దళితులపై ప్రేమ ఉంటే ఇడుపులపాయలో.. ఆక్రమణకు గురైన భూములను వైసీపీ ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ‘సీఎం జగన్‌ ఆడిస్తున్న ఆటలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అరటిపండులా’ మారారని జవహర్‌ ఎద్దేవా చేశారు.  జగన్ ఎన్ని ఎత్తులు వేసినా చంద్రబాబును ఎదుర్కొలేరని జవహర్‌ చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోమని జవహర్‌  హెచ్చరించారు. 

TAGS: Jawahar
Advertisement
Advertisement