గుంటూరు జిల్లా: నరసరావుపేట ఎమ్మెల్యే దోపిడి దారుగా మారారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దోపిడీ దారు ఎమ్మెల్యే దగ్గర పని చేసే పోలీసులు కూడా అలాగే పని చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలనే పోలీసులు టార్గెట్ చేస్తున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంలో బీసీ నేతను హత్య చేశారని, నరసరావుపేట నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్‌ను హతమార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అన్ని చోట్ల పోలీసులే పాత్రదారులుగా ఉన్నారన్నారు. సీఎం జగన్ జైలుకు వెళ్తే.. ఈ పోలీసులు కూడా జైలుకు వెళ్తారా?.. అని ప్రశ్నించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పని చేయాలని జవహర్ సూచించారు.