దళితుల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది: జవహర్‌

ABN , First Publish Date - 2021-08-16T01:41:04+05:30 IST

దళితుల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి జవహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

దళితుల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది: జవహర్‌

అమరావతి: దళితుల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి జవహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్భాటంగా ప్రారంభించిన దిశా చట్టం విద్యార్థిని రమ్య ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయిందని ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్లక్ష్యం దళితుల నిండు ప్రాణాలను బలిగొంటుందని దుయ్యబట్టారు. చట్టం అమలులో వైఫల్యం దళితులకు శాపమయిందని, రాష్ర్టంలో శాంతి భద్రతలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని జవహర్‌ కోరారు. రాష్ట్రాన్ని ప్రతీకార కుంపటిగా మార్చారు టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. పులివెందులలో దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించని సీఎం ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? అని ప్రశ్నించారు. సీఎం వైఖరితో వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, నేతలు మింగలేక, కక్కలేక ఉన్నారని వర్ల రామయ్య తెలిపారు.

Updated Date - 2021-08-16T01:41:04+05:30 IST