Advertisement
Advertisement
Abn logo
Advertisement

జవాద్‌ ఫియర్‌

తుఫాన్‌ హెచ్చరికతో రైతుల్లో ఆందోళన 

అధికార యంత్రాంగం అప్రమత్తం

జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సమీక్ష

కంట్రోలు రూమ్‌ల ఏర్పాటు


ఏలూరు సిటీ, డిసెంబరు 3: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌(జవాద్‌) ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల జారీతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో రైతులు తమ పంటలను ఒబ్బిడి చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మాసూళ్లు ముమ్మరం గా సాగుతున్న తరుణంలో పంట దక్కుతుందా లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరితోపాటు మిగిలిన పంటలను రక్షించుకోవడానికి రైతులు ప్రయత్నా లు చేస్తున్నారు. భారీగా వర్షాలు కురిస్తే ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసిపోయి నష్టపోతామని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మత్స్సకారులను సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 

 తుఫాన్‌ అప్రమత్తంపై కలెక్టర్‌ సమీక్ష..

తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికా ర యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. అధికా రులతో ముందస్తు చర్యలు, పల్లపు ప్రాంతాల్లో తీసుకోవా ల్సిన చర్యలపై సమీక్ష చేపట్టారు. అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందు లు ఏర్పడినా కంట్రోల్‌ రూమ్‌లకు ఫోన్‌ ద్వారా తెలపాలని ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించాలన్నారు. రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. 

కంట్రోలు రూమ్‌ల వివరాలు

జిల్లా కలెక్టరేట్‌                        1800–233–1077

నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం   92476 07963

కుక్కునూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం    08821–232221

జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం     96401 70352

ఏలూరు ఆర్డీవో కార్యాలయం      85006 67696

Advertisement
Advertisement