చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-09-18T03:45:15+05:30 IST

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు సూచించారు.

చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న న్యాయమూర్తి శ్రీనివాసరావు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి చదవాలన్నారు. కోర్టులు, చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే సమాచారం అందించాలన్నారు. ఎక్కడైనా ఫిర్యాదులు తీసుకోకపోతే నేరుగా కోర్టులో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సందిరెడ్డి రామారావు, సుధాకర్‌, షరీఫ్‌, ప్రభుదాసు, మస్తాన్‌, సుభానీ, సీఐ గిరిబాబు, ఎస్‌ఐలు కిశోర్‌, లతీపున్నీసా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T03:45:15+05:30 IST