బీచ్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఇందుకూరుపేట, జనవరి 25 : మండలంలోని మైపాడు బీచ్‌లో మంగళవారం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హరిత రిసార్ట్స్ ఆధ్వర్యంలో ఏపీటీడీ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జాతీయ నాయకుల చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హరిత భవన సముదాయంలో, బీచ్ ప్రాంతంలో మొక్కలను నాటారు. ఈ క్రమంలో బీచ్, తదితర ప్రాంతాలను శుభ్రపరిచారు. పర్యాటకులకు మాస్కులు ధరించడం, శానిటేషన్, భౌతికదూరంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివారెడ్డి, మైపాడు మేనేజర్ సునీల్‌రెడ్డితో పాటు సిబ్బంది, పర్యాటకులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటారు.