వీవీఐటీలో.. జాతిరత్నాల సందడి

ABN , First Publish Date - 2021-03-05T14:51:58+05:30 IST

ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం జాతి రత్నాలు చిత్రయూనిట్‌ వీవీఐటీ కళాశాలను సందర్శించింది. మార్చి 11న విడుదల కానున్న..

వీవీఐటీలో.. జాతిరత్నాల సందడి

పెదకాకాని: ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం జాతి రత్నాలు చిత్రయూనిట్‌ వీవీఐటీ కళాశాలను సందర్శించింది. మార్చి 11న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నవీన్‌, హీరోయిన్‌ ఫరియా, నటుడు ప్రియదర్శిని పులికొండ విద్యార్థుల మధ్య విడుదల చేశారు. ఈ సంద ర్భంగా హీరో మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింద న్నారు. డైరెక్టర్‌ అనుదీప్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదరించే విధంగా చిత్రాన్ని రూపొందించారన్నారు. ప్రియదర్శిని పులికొండ మాట్లాడుతూ హాస్య ప్రధానంగా రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు. ఈ సందర్భంగా నృత్య, సంగీత క్లబ్‌ల విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు విద్యార్థులతో ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T14:51:58+05:30 IST