Abn logo
Mar 2 2021 @ 21:44PM

‘జాతిరత్నాలు’కు సపోర్ట్ ఇస్తోన్న ప్రభాస్‌

ఒక హిట్‌ సినిమాకి అన్నీ కలిసొస్తాయి అంటే ఏంటో అనుకుంటాం.. కానీ 'జాతిరత్నాలు' సినిమా గురించి వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. అశ్వనీదత్‌ వైజయంతీ మూవీస్‌ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌ సపోర్ట్‌, 'మహానటి' చిత్రంతో మైమరపించిన నాగ్‌ అశ్విన్‌ చిత్రాన్ని నిర్మించడం.. న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి వంటి జాతిరత్నాలు నటించడం.. అన్నీ ఇలా సెట్‌ అవ్వడం మాములు విషయం కాదు. ఇదిలా ఉంటే.. ఈ జాతిరత్నాల్లో నేను ఒకడినంటూ.. ఈ చిత్రానికి యంగ్‌ రెబల్‌ స్టార్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సపోర్ట్ ఇస్తుండటం వెరసీ.. ఈ సినిమా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అవుతోంది. 


న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రం కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. రూ. 500 కోట్ల చుట్టూ తిరిగే ఈ కథను నాగ్‌ అశ్విన్‌ ఇన్‌పుట్స్‌తో అనుదీప్‌ అదిరిపోయే లెవల్‌లో తెరకెక్కించారట. ఇటీవల వచ్చిన టీజర్‌ చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఇక ఈ చిత్రానికి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా ఓ చెయ్యి వేయబోతున్నారు. చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మార్చి 4 సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 11న 'జాతిర‌త్నాలు' థియేట‌ర్ల‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement
Advertisement