Abn logo
Jan 25 2021 @ 01:13AM

జాతిరత్నాలు వచ్చేస్తున్నారు!

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ కె.వి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. వినోదాత్మకంగా సాగే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. రధన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement