జాతరో.. జాతర

ABN , First Publish Date - 2021-01-16T04:52:29+05:30 IST

జాతరో.. జాతర

జాతరో.. జాతర
పెర్కవేడులో ఎడ్లబండ్లపై వెళ్తున్న గ్రామస్థులు

జిల్లా వ్యాప్తంగా  సంక్రాంతి సందర్భంగా కిక్కిరిసిన ఆలయాలు

  • సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా జాతర సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామి, మల్లన్న శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. భక్తుల రాకతో ఆయా ఆలయ పరిసరాలు, దుకాణాలు కిక్కిరిశాయి. వివిఽధప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొ క్కులు చెల్లించుకున్నారు.


రాయపర్తి, జనవరి 15 : పెర్కవేడులో శుక్రవారం మల్లన్న జాతర వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి బోనం సమర్పించుకున్నారు. పొట్టేలుబండ్లు, ఎడ్ల బండ్లు ఆకట్టుకున్నాయి. రాయపర్తి ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, తహసీల్దార్‌ సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్నాల తారాశ్రీ, ఎంపీటీసీ అనూష తదితరులు పాల్గొన్నారు. 

దామెర: ఊరుగొండలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర వైభవంగా జరిగింది. ప్రభబండ్లు ఆకట్టుకున్నాయి. నేడు కూడా జాతర కొనసాగుతుందని ప్రధానార్చకులు శ్రీనివాసచార్యులు తెలిపారు. ఏసీపీ పి.శ్రీనివాస్‌, సీఐ టి.రమే్‌షకుమార్‌, ఎస్సై యు.భాస్కర్‌రెడ్డి  శాంతి భద్రతలను పర్యవేక్షించారు.


వర్ధన్నపేట: కట్ర్యాలలో దూడల మల్లికార్జునస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో బీజేపీ నాయకులు ముత్తిరెడ్డి కేశవరెడ్డి, గాడిపెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


వరంగల్‌ రూరల్‌: పర్వతగిరి మండలంలోని గోపనపెల్లిలో దూడెల మల్లికార్జునస్వామి జాతర వేడుకలు గురు, శుక్రవారాల్లో వైభవంగా జరిగాయి. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై ప్రశాంత్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. మామునూరు ఏసీపీ నరే్‌షకుమార్‌ శాంతభద్రతలను పర్యవేక్షించారు. ఆలయాన్ని జడ్పీటీసీ సింగులాల్‌, ఎంపీపీ లనావత్‌ కమలపంతులు, వైస్‌ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సొసైటీ చైర్మన్లు మనోజ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  


చెన్నారావుపేట: చెన్నారావుపేటలోని శ్రీ లక్ష్మీచెన్నకేవ స్వామి జాతర శుక్రవారం ముగిసింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భార్యలైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లలను ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనచార్యులు కల్యాణోత్సవం నిర్వహించి. సంక్రాంతి రోజు ప్రభబండ్లు, జడకోప్పు కోలాటాలు, ప్రత్యేక అకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్నగౌడ్‌, ఎంపీటీసీ  లక్ష్మీరాజన్న తదితరులు దర్శించుకున్నారు. 

సంగెం: సంగెం మండలం గవిచర్ల–ఆశాలపల్లి గ్రామాల మధ్యగల పర్వతాల మల్లిఖార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఒగ్గుపూజారులు స్వామివారికి చిన్నపట్నం వేసి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.



Updated Date - 2021-01-16T04:52:29+05:30 IST