జాతీయ పంటల బీమాతో లాభాలు

ABN , First Publish Date - 2021-02-25T03:56:28+05:30 IST

జాతీయ పంటల బీమా వలన అనేక లాభాలు ఉంటాయని జిల్లా ముఖ్య ప్రణాళిక (సీడ్‌ ప్లానింగ్‌) అధికారి డి.వెంకటేశ్వర్లు అన్నారు.

జాతీయ పంటల బీమాతో లాభాలు
శనగ పంట దిగుబడి వ్యత్యాసాన్ని పరిశీలిస్తున్న అధికారులు


సీపీవో వెంకటేశ్వర్లు

పొదిలి రూరల్‌, ఫిబ్రవరి 24 : జాతీయ పంటల బీమా వలన అనేక లాభాలు ఉంటాయని జిల్లా ముఖ్య ప్రణాళిక (సీడ్‌ ప్లానింగ్‌) అధికారి డి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని మూగచింతల గ్రామంలో పంటకోత ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శనగలో తెగుళ్లు, చీడపీడల వలన లేదా ఏకారణంతోనైనా పంట దిగుబడి తగ్గితే దాని వ్యత్యాసాన్ని పరిశీలించి ఇన్సూరెన్స్‌ వర్తింప చేస్తారని తెలిపారు.  1985 నుంచి రుణగ్రహీత పథ కం రైతులకు ఉపయోగపడేలా సమగ్ర పంటల బీమా  అమలు చేస్తున్నారన్నారు. 2000 సంవత్సరం నుంచి రు ణాలు పొందిన రైతులకు ప్ర యోజనకారిగా జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఒక గ్రామాన్ని యూనిట్‌ గా తీసుకుని పంట కోత ప్ర యోజనాలను నిర్వహించి ఆ ఏడాది దిగుబడులు తెలుసుకుంటామన్నారు.  అనంతరం లెక్క ప్రకారం 8 నుంచి 10 క్వింటాళ్ల వస్తే బీమా వర్తించదన్నారు. ప్రస్తుతం 3 నుంచి మూడున్నర క్వింటాళ్లు మాత్రమే  దిగుబడి వస్తున్నట్లు తెలిపారు. అలా వచ్చిన గ్రామాలను నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అందులో భాగంగా ఈ రోజు మూగచింతలలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సునీత, వ్యవసాయాధికారి డి.శ్రీనివాసరెడ్డి, ఏఈ వో, ఏఎ్‌సవో, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T03:56:28+05:30 IST