జాతర

ABN , First Publish Date - 2020-07-27T05:52:49+05:30 IST

జాతర ముగిసినట్టే. పగటి వేషాలు కనుమరుగైనాయి బుర్రకథలు, రికార్డ్‌ డాన్సులు ముగిశాయి తీపి ఫలహార బళ్ళ వెలుగు గగన తార అయింది...

జాతర

జాతర ముగిసినట్టే.

పగటి వేషాలు కనుమరుగైనాయి 

బుర్రకథలు, రికార్డ్‌ డాన్సులు ముగిశాయి 

తీపి ఫలహార బళ్ళ వెలుగు గగన తార అయింది 

తిరిగి తిరిగి అరిగిన రంగుల రాట్నం 

ఇక తిరగనంటోంది

కలసి తిరిగినవాళ్ళు వెళ్ళిపోయారు 

వీడ్కోలు చెప్పి, చెప్పక. 

ఐనా, ఇక్కడే,

రాలిన రంగుల కాగితాలు ఏరుతూ,

పేలిన మందుగుండు సామాన్ల శకలాలు ఏరుతూ 

చేయి జారి గాయపడిన ఆటబొమ్మను ఓదారుస్తూ,

తల్లి చీర కొంగు పట్టుకొని కదలనని మొరాయించే 

బాలుడు, ఇంకా జాతర ప్రాంగణాన వేలాడే, ఈ వృద్ధుడు!

ఎల్‌. ఆర్‌. స్వామి

99490 75859


Updated Date - 2020-07-27T05:52:49+05:30 IST