Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 08 Aug 2022 20:46:54 IST

Jasprit Bumrah : బ్యాడ్‌న్యూస్.. ‘ఆసియా టీ20 కప్’కు బుమ్రా దూరం?.. కారణం ఇదేనట..

twitter-iconwatsapp-iconfb-icon
Jasprit Bumrah : బ్యాడ్‌న్యూస్.. ఆసియా టీ20 కప్కు బుమ్రా దూరం?.. కారణం ఇదేనట..

ముంబై : ‘ఆసియా టీ20 కప్ ’కు(Asia T20 cup) ముందు టీమిండియాకు(Team India) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి(Back Injury) కారణంగా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టోర్నీకి దూరమవ్వనున్నాడని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. ‘‘జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆసియా కప్‌లో ఆడడు. బుమ్రా మనకు ప్రధాన బౌలర్. తిరిగి టీ20 ప్రపంచ కప్‌లోనే ఆడతాడు. గాయం తిరగదోడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆసియా కప్‌లో అతడిని రిస్క్‌కి గురిచేయబోం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కాగా ఆసియా కప్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.


బుమ్రా చివరిగా ఇంగ్లండ్‌పై(England) వన్డే సిరీస్‌(One day series) ఆడాడు. విశ్రాంతి దృష్ట్యా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో ఆడించలేదు. రాబోయే జింబాబ్వే సిరీస్‌లో కూడా ఆడించే అవకాశాలు లేవు. అయితే స్వదేశంలో కీలకమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ల నేపథ్యంలో ఫిట్‌గా ఉంచేందుకుగానూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ పరిశీలనలో ఉండమని బుమ్రాను కోరే అవకాశాలున్నాయి. కొన్నేళ్లక్రితం కూడా బుమ్రా ఇదే తరహా సమస్యతో బాధపడ్డాడు. ఎక్కువకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం బుమ్రా ఫ్యామిలీ ట్రిప్ కోసం అమెరికా ట్రిప్‌లో ఉన్నాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.