ఇండియా నుంచి Jasprit Bumrah ఒక్కడికే చోటు

ABN , First Publish Date - 2022-05-03T18:17:51+05:30 IST

ముంబై : భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా గొప్ప నైపుణ్యమున్న బౌలర్ అని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌ మహిళా జయవర్దనే ప్రశంసించాడు.

ఇండియా నుంచి Jasprit Bumrah ఒక్కడికే చోటు

ముంబై : భారత బౌలర్లలో Jasprit Bumrah గొప్ప నైపుణ్యమున్న బౌలర్ అని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌ Mahela Jayawardena ప్రశంసించాడు. వికెట్లు తీసే బౌలర్ జట్టుకు ఎప్పుడూ అవసరమే. ఈ విషయంలో బుమ్రాకు మించిన ఆప్షన్ లేదు. చక్కగా ఇన్నింగ్స్‌ను ముగిస్తాడని కొనియాడాడు. తన డ్రీమ్ టీ20 లెవన్‌ టీంకు మొదటి ఐదురుగు ప్లేయర్ పేర్లను వెల్లడించగా భారత్ నుంచి ఒక్క బుమ్రాకు మాత్రమే చోటిచ్చాడు. బుమ్రా మ్యాచ్‌ ఏ దశలో ఉన్నా బౌలింగ్ చేయగలడు. చక్కటి నైపుణ్యం, సామర్థ్యం ఉన్న ఆటగాడు అని జయవర్దనే అన్నాడు. ఇన్నింగ్స్ ముగించాలని భావించినప్పుడు బుమ్రా చక్కటి ఆప్షన్ అని అన్నాడు. కాగా మిగతా నలుగురు ఆటగాళ్లలో ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రీది, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జాస్ బట్లర్, పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు. జాస్ బట్లర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తానని చెప్పారు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో ఎవరిని మళ్లీ ఆడించాలనుకుంటున్నారని ప్రశ్నించగా... క్రిస్ గేల్ పేరు చెప్పాడు. జాస్ బట్లర్, క్రిస్ గేల్ ఇద్దరూ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే అదిరిపోతుందని జయవర్దనే అన్నాడు. మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగల క్రిస్‌గేల్ ఖచ్చితంగా ఓపెనర్‌గానే పంపిస్తానని చెప్పాడు.


కాగా భారత్ తరపున 57  టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 19.89 సగటుతో 67 వికెట్లు తీశాడు. ఇక జాస్ బట్లర్ ఐపీఎల్ 2022లో ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 3 సెంచరీలు బాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. పేస్‌తోపాటు స్పీన్ బౌలింగ్‌లోనూ రాణించగల సమర్థుడని బట్లర్‌ను జయవర్ధనే ప్రశంసించాడు. ఇక పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రీది ప్రస్తుతం భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. గతేడాది వరల్డ్‌కప్ అదరగొట్టాడని జయవర్దనే గుర్తుచేశాడు. రషీద్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్‌లు అద్భుతంగా రాణించగలరని ప్రశంసించాడు. ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయవర్దనే ఈ విషయాలను పంచుకున్నాడు.

Read more