Jul 31 2021 @ 13:24PM

‘విక్రాంత్ రోణ’లో జాక్వలైన్ ఫస్ట్‌లుక్‌ విడుదల

‘సాహో’ తర్వాత బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటించిన మరో దక్షిణాది చిత్రం ‘విక్రాంత్ రోణ’. కిచ్చా సుదీప్ హీరోగా రూపొంతోన్న ఈ చిత్రాన్ని అనూప్ భండారి ద‌ర్శక‌త్వంలో షాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మిస్తున్నారు. ఇది త్రీడీ చిత్రం. 14 భాష‌ల్లో 55 దేశాల్లో విడుద‌ల‌వుతున్న సూప‌ర్ హీరో చిత్ర‌మిది. ఈ సినిమాలో జాక్వ‌లైన్ గ‌దంగ్ రాక్క‌మ్మ అనే పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఓ కీల‌క పాత్ర‌తో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ఈ చిత్రంలో ఆమె చేశారు. ఈ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్‌తో పాటు డాన్స్ చేస్తున్న జాక్వలైన్‌ను చూడొచ్చు. ఓ మాసీ ట‌చ్‌తో ఈమె పాత్ర క‌న‌పిస్తుంద‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.