రబ్బరు బ్యాండ్‌లతో డ్రెస్‌

ABN , First Publish Date - 2020-03-04T05:57:58+05:30 IST

నూలుతో తయారుచేసిన బట్టలు చూసుంటారు. పట్టుతో తయారుచేసిన వస్త్రాల గురించి తెలిసే ఉంటుంది. కానీ రబ్బరు బ్యాండ్లతో తయారుచేసిన దుస్తులను ఎప్పుడైనా చూశారా?...

రబ్బరు బ్యాండ్‌లతో డ్రెస్‌

నూలుతో తయారుచేసిన బట్టలు చూసుంటారు. పట్టుతో తయారుచేసిన వస్త్రాల గురించి తెలిసే ఉంటుంది. కానీ రబ్బరు బ్యాండ్లతో తయారుచేసిన దుస్తులను ఎప్పుడైనా చూశారా? జపాన్‌లో ఓ విద్యార్థిని పూర్తిగా రబ్బరు బ్యాండ్లతో ప్రత్యేకమైన దుస్తులు తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించింది. టామా ఆర్ట్‌ యూనివర్సిటీలో చదువుతున్న రీ సకామోటో అనే విద్యార్థిని ప్రాజెక్టులో భాగంగా అందరికన్నా ప్రత్యేకంగా దుస్తులు తయారుచేయాలనుకుంది. ఇందుకోసం కాటన్‌ బదులు రబ్బరు బ్యాండులను ఎంచుకుంది. రబ్బరు బ్యాండులను సేకరించింది. ఇంటివద్ద ఓపికగా ఒక్కో రబ్బరు బ్యాండును అల్లుతూ డ్రెస్‌ తయారుచేసింది. ఇందుకోసం కొన్ని వేల రబ్బరు బ్యాండులను ఉపయోగించింది. సకామోటో తయారుచేసిన డ్రెస్‌ను చూసిన వారందరూ ఆమె వినూత్నమైన ఆలోచనకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. 

Updated Date - 2020-03-04T05:57:58+05:30 IST