Viral News: రండి బాబు.. రండి.. మద్యం ఎలా తాగించాలో చెప్పండంటూ యువతకు ప్రభుత్వం రిక్వెస్ట్.. జాతీయ స్థాయిలో పోటీ!

ABN , First Publish Date - 2022-08-20T17:15:56+05:30 IST

ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే పరిపాలన చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. అన్నీ కానప్పటికీ.. కొన్ని ప్రభుత్వాలు మాత్రం.. మద్యంపై విధించిన పన్నుల ద్వారా వచ్చే డబ్బుతోనే బండి లాగుతున్నాయి. దీని

Viral News: రండి బాబు.. రండి.. మద్యం ఎలా తాగించాలో చెప్పండంటూ యువతకు ప్రభుత్వం రిక్వెస్ట్.. జాతీయ స్థాయిలో పోటీ!

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే పరిపాలన చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. అన్నీ కానప్పటికీ.. కొన్ని ప్రభుత్వాలు మాత్రం.. మద్యంపై విధించిన పన్నుల ద్వారా వచ్చే డబ్బుతోనే బండి లాగుతున్నాయి. దీనికి తాజాగా ఓ ప్రభుత్వం చేసిన ప్రకటనే ఉదహరణ. జాతీయ స్థాయిలో పోటీ నిర్వహిస్తూ మరీ.. యువతతో మద్యపానాన్ని ఎలా తాగించాలో(campaign to promote liquor) ఐడియాలు చెప్పండంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఇంతకూ ఏ ప్రభుత్వం ఇటువంటి ప్రకటన చేసింది? అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


జపాన్ ప్రభుత్వం(Japan Govt) అక్కడి యువతతో సాధ్యమైనంత ఎక్కువ మద్యాన్ని తాగించాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ(National Tax Agency) ‘సేక్ వివా’(Sake Viva!” campaign) పేరుతో జాతీయ స్థాయిలో పోటీలను ప్రారంభించింది. ఈ పోటీలో 20-39ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ పోటీలో పాల్గొన్న యువత.. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పోటీలు సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతాయని.. ఆసక్తి ఉన్న యువత ఇందులో పాల్గొనచ్చని వెల్లడించింది. 



ప్రకటనకు కారణం ఇదే..

జపాన్ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించడానికి పెద్ద కారణమే ఉంది. ఇప్పుడున్న యువత.. వారి తల్లిదండ్రులు, పూర్వీకులతో పోల్చితే తక్కువ మద్యాన్ని సేవిస్తున్నారట. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న యువత.. మందుకు దూరంగా ఉంటున్నారట. దీంతో జపాన్ ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందట. 1980ల్లో మొత్తం ట్యాక్స్ రెవెన్యూల్లో కేవలం మద్యంపైనే వచ్చే ఆదాయం 5శాతం ఉండగా.. 2011లో 3శాతానికి పడిపోయింది. అదికాస్తా 2020లో 1.7% పరిమితమైందట. కరోనా, ఇతర కారణాల వల్ల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జపాన్ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు మెరుగుపడేలా చేసి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది.


Updated Date - 2022-08-20T17:15:56+05:30 IST