భార్యాభర్తలకు ఒకే ఇంటి పేరు ఉండాలి: జపాన్ కోర్టు స్పష్టీకరణ

ABN , First Publish Date - 2021-06-24T04:12:45+05:30 IST

పెళ్లైన తరువాత భార్యభర్తలిద్దరికీ ఒకే ఇంటిపేరు ఉండాలని జపాన్ సర్వోన్నత కోర్టు బుధవారం నాడు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనని తేల్చి చెప్పింది.

భార్యాభర్తలకు ఒకే ఇంటి పేరు ఉండాలి: జపాన్ కోర్టు స్పష్టీకరణ

టోక్యో: పెళ్లైన తరువాత భార్యభర్తలిద్దరికీ ఒకే ఇంటిపేరు ఉండాలని జపాన్ సర్వోన్నత కోర్టు బుధవారం నాడు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనని తేల్చి చెప్పింది. పెళ్లికా మునుపు ఉపయోగించిన తమ పేర్లను అలాగే కొనసాగిస్తామంటూ మూడు జంటలు వేసిన పిటిషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా కొట్టేసింది. ఈ చట్టం వివక్షాపూరితంగా ఉందన్న వారి ఆరోపణతో కోర్టు ఏకీభవించలేదు. వివాహంలో స్వేఛ్చ, సమానత్వం ఉండాలన్న వాదనను కోర్టు తోసి పుచ్చింది. ఇక బార్యభర్తల ఇంటిపేర్లు ఎప్పటినుంచో జపాన్‌లో హాట్ టాపిక్‌గా ఉన్నాయి. సంప్రదాయిక వాదిగా పేరున్న షింజో అబే స్థానంలో యోషిహిడే షుగా ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-06-24T04:12:45+05:30 IST