ఇంటర్నెట్ స్పీడ్‌కు సంబంధించి జపాన్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 319 టెరాబైట్స్ పర్ సెకండ్స్ స్పీడ్‌తో జపాన్ ఇంజనీర్లు అద్భుతం సాధించారు. ఇది అమెరికాలోని యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్‌కంటే 7.6 మిలియన్ రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ స్పీడ్ ప్రకారం ఒక్క సెకండ్లోనే 80,000 మూవీస్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక టీబీ అంటే 1000 జీబీ అనే సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ స్పీడ్ సాధించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ పరిశోధకులు దీన్ని డెవలప్ చేశారు. నాలుగు ప్రధాన భాగాలతో తయారు చేసిన ఆప్టికల్ ఫైబర్‌ను లేజర్‌తో అనుసంధానం చేసి, వేర్వేరు వేవ్‌లెంత్స్ ఉపయోగించి ఈ టెక్నాలజీని తయారు చేశారు. ఈ ఇంటర్నెట్ ఇదే స్పీడ్‌తో దాదాపు 2896 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే, ఈ టెక్నాలజీ వాడటం చాలా ఖరీదైన వ్యవహారం.