ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడమే లక్ష్యం!

ABN , First Publish Date - 2021-02-28T08:48:28+05:30 IST

‘‘ప్రతి ఒక్కరి మనసు గెలవడం అసాధ్యమే అని నాకూ తెలుసు. అయినా మంచి నటనతో ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరి మన్ననలు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తాను.

ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడమే లక్ష్యం!

‘‘ప్రతి ఒక్కరి మనసు గెలవడం అసాధ్యమే అని నాకూ తెలుసు. అయినా మంచి నటనతో ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరి మన్ననలు పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. ఆ దిశగా నా శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అంతిమంగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడమే నా లక్ష్యం’’ అని జాన్వీకపూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2018లో ‘ధడక్‌’ చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు.


ఆ సందర్భంలో స్టార్‌ హీరోయిన్‌ తనయ కాబట్టే సినిమా అవకాశాలు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘మంచి నటిగా నిరూపించుకోవడమొక్కటే నా ముందున్న లక్ష్యం. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా దానిపైనే’’ అని ఆమె చెప్పారు. జాన్వీ నటించిన ‘రూహీ’ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలవుతోంది. 

Updated Date - 2021-02-28T08:48:28+05:30 IST