Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 27 Jan 2022 09:31:21 IST

తన అభిమాన హీరోతో జాన్వీ సౌత్ ఎంట్రీ?

twitter-iconwatsapp-iconfb-icon
తన అభిమాన హీరోతో జాన్వీ సౌత్ ఎంట్రీ?

దివంగత హీరోయిన్ శ్రీదేవి తన కుమార్తె‌ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా సౌత్ లోనే లాంఛ్ చేయాలని అనుకునేవారు. అయితే అప్పట్లో ఆమె కోరిక తీరలేదు. బాలీవుడ్ మూవీతోనే జాన్వీ లాంఛ్ అయింది. ఆ తర్వాత ఆమెను తెలుగులో కథానాయికగా పరిచయం చేయాలని చాలా మంది అనుకున్నారు. అది కూడా సాధ్యపడలేదు. ఇప్పుడు మరోసారి జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ వార్తల్లో నిలుస్తోంది. ఈ సారి జాన్వీ తన అభిమాన హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆమె అభిమాన హీరో ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో లో తన అభిమాన హీరో విజయ్ దేవరకొండ అని అతడితో నటించే అవకాశమొస్తే వదలిపెట్టను అని చెప్పిన సంగతి తెలిసిందే. 


కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందే చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుందట. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ చిత్రం విడుదలవుతుంది. దీనికి దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాథ్. నిజానికి ‘లైగర్’ సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ ను అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ‘లైగర్’ తర్వాత విజయ్- పూరీ కలయికలో మరో సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో విజయ్ కు జోడీగా జాన్వీ కపూర్‌ను ఖాయం చేశారట. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలికిస్తుందట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement