సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు

ABN , First Publish Date - 2022-05-25T05:22:50+05:30 IST

సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు

సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు

దోమ/ధారూరు, మే 24 : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న జనుము, జీలుగ విత్తనాలు అవసరమున్న ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అనసూయ, సర్పంచ్‌ రాజిరెడ్డిలు తెలిపారు. మంగళవారం దోమలోని ఆగ్రోస్‌ సేవా కేంద్రంలో సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీలుగ 30 కేజీల బస్తా రూ.664, జనుము రూ.1165లకు రాయితీపై అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏవో ప్రభాకర్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బి.లక్ష్మయ్య, ఉపసర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, రైతులు తదితరులున్నారు. అలాగే జనుము, జీలుగ విత్తనాలు 65 శాతం సబ్సీడీపై ధారూరు అగ్రోస్‌ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, అవసరమున్న రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు తీసుకువచ్చి ఏఈవోల వద్ద అన్‌లైన్‌ సీడ్‌ పర్మిట్‌ తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జ్యోతి తెలిపారు. జనుము 30 క్వింటాళ్లు, జీలుగ 100 క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయని ఆమె చెప్పారు. జీలుగ సబ్సీడీపై క్వింటాల్‌కు రూ.2,214, జనుము క్వింటాల్‌కు రూ.2,914లుగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2022-05-25T05:22:50+05:30 IST