Abn logo
Mar 5 2021 @ 18:25PM

టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు: పెద్దిరెడ్డి

అమరావతి: టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కులం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. కాబట్టే 80శాతం పంచాయతీలు గెలిచామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 80 శాతం పైగా స్థానాలు గెలుస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేశామని తెలిపారు. గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. రూ.5 లక్షల లోపు పనులకు బిల్లులు చెల్లిస్తున్నామని, రూ.5 లక్షల పైబడిన పనులకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అధికారులపై ప్రభుత్వానికి కక్షసాధింపు లేదని, ఏసీబీ కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం నమ్మవద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement