Oct 20 2021 @ 21:02PM

స్టార్ కిడ్ ట్యాగ్‌ తో లాభాలు, నష్టాలు రెండు ఉంటయాంటున్న జాన్వీకపూర్ కజిన్

స్టార్ కిడ్ ట్యాగ్ వల్ల లాభాలు, నష్టాలు రెండు ఉంటాయని సంజయ్ కపూర్ కూతురు, జాన్వీ కపూర్ కజిన్ శనయ కపూర్ చెబుతోంది. శత్రఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా కూడా గతంలో ఇలానే చెప్పింది. 


బాలీవుడ్‌లో స్టార్ కిడ్‌లను లాంచ్ చేయడంలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ కు మంచి పేరుంది. అందుకే కంగనా రనౌత్ ‘‘ఫ్లాగ్ బేరర్ ఆఫ్ నెపోటిజం’’ గా ఆయనను అభివర్ణిస్తుంటుంది. జాన్వీ కపూర్ కజిన్ అయిన శనయ కపూర్‌ను కూడా ఆయనే లాంచ్ చేయనున్నారు. ఆ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. బాలీవుడ్ లోకి అరంగ్రేటం చేయకముందే ఆమెపై స్టార్ కిడ్, నెపోటిజం కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ పై ఆమె స్పందించింది. 


స్టార్ కిడ్ ట్యాగ్ పట్ల ఏలా స్పందిస్తారని శనయకపూర్‌ను అడగగా..‘‘ మనం ఏ పని చేసినా అటువంటి కామెంట్స్ వస్తుంటాయి. నేను ఎప్పుడు పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను. ఇన్ స్టాగ్రామ్‌లోని ఫాలోవర్స్, మీడియా ఎప్పుడు నాకు  మద్దతు తెలుపుతున్నారు. నేను చేసే పని మీద మాత్రమే శ్రద్ధ పెడతాను. ఇటువంటి కామెంట్స్‌కు దూరంగా ఉంటాను. నేను చేసే పనిని ఇష్టపడతాను. లక్ష్యం చేరకముందే ఏలా చేరుతున్నాం అనే దాని మీదే దృష్టిసారిస్తాను ’’ అని ఆమె చెప్పింది. 


గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రానికి శనయ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ..‘‘ గుంజన్ సక్సేనా చిత్రానికి పనిచేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా కెరీర్‌ను ఆరంభించడానికి ముందు ఈ చిత్రం పునాదిలా నాకెంతో ఉపయోగపడింది.  ఈ మూవీకి పనిచేయడం ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను ’’ అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె అనేక బ్యూటీ బ్రాండ్‌లకు అంబాసిడర్ గా చేస్తోంది.

Bollywoodమరిన్ని...