Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 05 Jan 2022 17:40:35 IST

Janhvi Kapoor: సర్‌ప్రైజ్‌గా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్..?

twitter-iconwatsapp-iconfb-icon
Janhvi Kapoor: సర్‌ప్రైజ్‌గా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్..?

అతిలోక సుందరి శ్రీదేవి టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను సినిమాలు చేసింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గతంలోనే బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ సౌత్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తోందా అని శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు. సర్‌ప్రైజ్‌గా ఆమె కోలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆమె ‘‘ వలీమై’’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది.

Janhvi Kapoor: సర్‌ప్రైజ్‌గా సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్..?

అజిత్ హీరోగా తెరకెక్కిన ‘‘ వలీమై’’ సినిమా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ ప్రీమీయర్స్ జనవరి 12న ప్రారంభం కాబోతున్నాయి. యుఎస్ఏ‌లో సినిమాకు సంబంధించిన టిక్కెట్ బుక్కింగ్స్ మొదలయ్యాయి. ఆ వెబ్‌సైట్‌లు ‘‘ వలీమై’’ నటీనటుల జాబితాలో జాన్వీ కపూర్‌ను చూపిస్తుండటం గమనార్హం. ‘‘ వలీమై ’’లో అజిత్, కార్తికేయ, హ్యుమా ఖురేషి,  యామీ గౌతమ్, సుమిత్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా, బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.     


అజిత్ హీరోగా నటించిన ‘‘ నెర్కొండ పావై’’ తోనే ఆమె కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాలి. చిత్రానికి సంబంధించిన కీలక పాత్రల్లో నటించాలి. కానీ, అవివార్య కారణాల వల్ల ఆ సినిమాలో ఆమె నటించలేదు. ‘‘ నెర్కొండ పావై ’’కి  జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement