మద్య నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-07-30T22:17:25+05:30 IST

మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు

మద్య నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ నిరసన

ఏలూరు జిల్లా/ జంగారెడ్డిగూడెం: మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా విభాగం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో రావూరి జంక్షన్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతల వెంకటరమణ మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి రాక ముందు దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. అంటే జగన్ చెప్పిన మద్యపాన నిషేధం ఇంకా అమలు కానేట్టేనా అని ప్రశ్నించారు. ‘‘నువ్వు చెప్పిన మద్యపాన నిషేదం ఎప్పుడు చేస్తావ్ జగన్ రెడ్డి’’ అంటూ నినాదాలు చేశారు. 


ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడం సౌభాగ్యవతి, పొలవరం నియోజకవర్గ అధ్యక్షురాలు అయినపర్తి చందన శ్రీదేవి, దెందులూరు అధ్యక్షురాలు మసాబత్తుల మౌనిక, కుంజం సుభాషిణి, జారం చాందిని, చింతల రాజశ్రీ, చింతల కృష్ణవేణి, కౌన్సిలర్స్ కరుతూరి రమాదేవి, తెలగరపు జ్యోతి, జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, బొబ్బర రాజ్ పాల్ కుమార్, పాతూరి అంబేడ్కర్, కుక్కల మాధవరావు, తుటి కుంట రాము, భోగవల్లి రత్నాజి, బాబీ, క్రిష్ నాని కృపవరం, అల్లావుద్దీన్, నాగు , రాజు మున్నగు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-30T22:17:25+05:30 IST