ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నల్ల బెలున్లతో కాంగ్రెస్(Congress) పార్టీ నిరసనకు దిగింది. ప్రధాని మోదీ (Modi) జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు (Jetti gurunathrao) నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది శూన్యమంటూ ఆరోపించారు. మోదీ పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథ్ రావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి