జనగామ: జిల్లాలోని లింగాల గణపురం మండలం వనపర్తి స్టేజి వద్ద సూర్యాపేట జనగామ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గేదలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...టాటా ఎస్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకని గాయపడిన వ్యక్తిని జనగామ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. టాటా ఏస్‌లో ఉన్న మూడు గేదలకు గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ చెందిన చిన్న శేఖర్ రెడ్డి రఘు రెడ్డి, ధనలక్ష్మిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బంధువులు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.