Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్‌లో ఘనంగా జన సేనాని జన్మదిన వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలైన ఒమన్, యూఏఈ, సౌదీ, కువైత్, బహ్రెయిన్, ఖతర్‌లలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్  జన్మ దినత్సోవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంద్భంగా గల్ఫ్ ప్రవాసీయులు జన సేన పార్టీకి ఏవిధంగా అండగా ఉండాలి, పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని చర్చించినట్లుగా దుబాయిలోని నిర్వహకులు కేసరి త్రిమూర్తులు వెల్లడించారు.

ఒమన్‌లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్ రామదాసు, కువైత్‌లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ కే శ్రీకాంత్, రామచంద్ర నాయక్, ఖతర్‌లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ సత్యం, శ్రీకాంత్, దొర, సౌదీ అరేబియాలో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ భాస్కర్ రావు, మూర్తి, బహ్రెయిన్‌లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర రావు, యూఏఈలో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ త్రిమూర్తులు, చంద్రశేఖర్, కే రవి, నారాయణ, ముని ఆధ్వర్యంలో జన సైనికులు, మహిళలు వేడుకలు నిర్వహించినట్లుగా తెలిపారు.
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement