Abn logo
Oct 26 2021 @ 23:11PM

అన్ని డివిజన్లలో పోటీ చేస్తాం

మాట్లాడుతున్న మనుక్రాంత్‌రెడ్డి

జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి

నెల్లూరు(క్రైం), అక్టోబరు 26: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో నగరంలోని 54 డివిజన్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు, అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెల్లూరు నగర పాలిక ఎన్నికల్లో కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గునుకుల కిషోర్‌, సుజయ్‌బాబు, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.