విజయవాడ: అతి తొందరలో వైసీపీకి బుద్ధి చెబుతామని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన చరిత్ర విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మరో మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందని, మంత్రి పదవి కాపాడుకునేందుకు, సీఎం జగన్ మెప్పు పొందడం కోసం బాగా రెచ్చిపోతున్నారన్నారు. ప్రజల చేతిలో వెల్లంపల్లికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. దేవుడి ఆస్తులు కబ్జాచేసిన పనికిమాలిన మంత్రి.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేని మంత్రి.. జనసేన పార్టీ గురించి మాట్లాడతారా? అంటూ పోతిన మహేష్ మండిపడ్డారు.