టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన ఆగ్రహం

ABN , First Publish Date - 2020-05-23T20:18:27+05:30 IST

టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని

టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన ఆగ్రహం

తిరుపతి: టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు. 


తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. టీమ్‌ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-05-23T20:18:27+05:30 IST