Amaravathi: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రంలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. నిన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీలో జగన్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తులపై తగ్గేదేలే అని పవన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మెగా అభిమాన సంఘాల ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై అభిమానులకు దిశానిర్దేశం చేశారు.