‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’: జనసేన

ABN , First Publish Date - 2022-05-01T21:37:27+05:30 IST

తిరుపతి: నగరంలో జనసేన వినూత్న నిరసన వ్యక్తం చేస్తోంది.

‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’: జనసేన

తిరుపతి: నగరంలో జనసేన వినూత్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకుని ‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’ అంటూ ఫ్లెక్సీ పెట్టి నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ..దండోరా వేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్‌లకు సంబంధించి ట్రాన్స్‌పోర్టుకు ఇప్పటికే దాదాపు రూ. 2 కోట్లు బకాయి ఉన్నారని, దీంతో ట్రాన్స్ పోర్టు వాహనాలు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. మొన్న ఒంగోలులో చేసినట్లు తిరుపతిలో ఉన్న స్థానికుల వాహనాలు తీసుకుని, కాన్వాయ్‌లుగా వాడుకునే అవకాశముందని, అందుకే ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తున్నామని అన్నారు. మోటారు ఫీల్డుకు చెందినవారు తమ తమ కార్లకు తాళాలు వేసుకోవాలని చెబుతున్నామని, అలాగే 4, 5 తేదీల్లో తిరుపతికి వచ్చే భక్తులు కూడా కార్లలో రావద్దని జనసేన నేతలు సూచించారు.

Updated Date - 2022-05-01T21:37:27+05:30 IST