విశాఖలో జనసేన వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-04-29T17:29:55+05:30 IST

పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ... జనసేన వినూత్న నిరసన చేపట్టింది.

విశాఖలో జనసేన వినూత్న నిరసన

విశాఖపట్నం: పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ... జనసేన వినూత్న నిరసన చేపట్టింది. గురుద్వార జంక్షన్ నుంచి ఏపీ ఇపిడిసిఎల్ కార్యాలయం వరకు చీపుర్లతో రోడ్డు ఊడుస్తూ నిరసన తెలిపారు. విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలు విధించ వద్దని సీఎండికి వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ ఉషాకిరణ్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-29T17:29:55+05:30 IST