ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది.. హైకోర్టు తీర్పుపై పవన్ ట్వీట్

ABN , First Publish Date - 2020-05-29T18:53:06+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది.. హైకోర్టు తీర్పుపై పవన్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసాన్ని ఇనుమడింపజేసిందన్నారు.    




నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుంచి తొలగినట్టేనని నిపుణులు తెలిపారు.


Updated Date - 2020-05-29T18:53:06+05:30 IST