PAWANKALYANను YCP ఎందుకు TARGET చేసింది?

ABN , First Publish Date - 2022-04-27T01:16:26+05:30 IST

ఇటీవల కాలంలో ఏపీలో అధికార పార్టీ.. జనసేన పార్టీని టార్గెట్ చేసింది. సీఎం జగన్ మోహన్ దగ్గర నుంచి కొత్తగా ..

PAWANKALYANను YCP ఎందుకు TARGET చేసింది?

అమరావతి: ఇటీవల కాలంలో ఏపీలో అధికార పార్టీ.. జనసేన పార్టీని టార్గెట్ చేసింది. సీఎం జగన్ మోహన్ దగ్గర నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు వరకూ రోజూ పవన్ కల్యాణ్‌ను దూషిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే పవన్ కల్యాణ్‌ను తీసి పారేసినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఏమీ తెలియదని, ఆయన రాజకీయాలకు పనికిరాడనే విధంగా హేళన చేసి మాట్లాడుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా దీటుగానే వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. తనను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను తాను సీబీఐ దత్తపుత్రుడంటానని పవన్ హెచ్చరిస్తున్నారు.


కాగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుకు పవన్ మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరీగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. తాజాగా వైసీపీని ఓడించాడని తమతో కలిసి వచ్చే పార్టీలకు మద్దతు ఇస్తానని ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పవన్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేతలు పదే పదే పవన్ కల్యాణ్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు. అటు చిరంజీవిని కూడా ప్రస్తావిస్తూ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. . 


ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘‘పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎందుకు టార్గెట్ చేసింది?. మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందా?. వైసీపీ నేతలు ఉచ్ఛనీచాలు లేని భాషని ఎందుకు వాడుతున్నారు?. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ పదే పదే ఎందుకు లింక్ పెడుతున్నారు?. యూత్‎ను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.




Updated Date - 2022-04-27T01:16:26+05:30 IST